రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. అయితే ఇదో మల్టీస్టారర్ అని ముందు నుంచీ ప్రచారం జరుగుతూ వస్తోంది. పవన్ కల్యాణ్ - చరణ్‌లు ఈ సినిమాలో కలసి నటిస్తారని, చిరంజీవి అతిథి పాత్రలో దర్శనమిస్తారని చెప్పుకున్నారు. నిజంగానే ఇది మల్టీస్టారరే నట. అయితే,... చరణ్ తో కలిసి నటించే ఆ హీరో పవన్ కల్యాణ్ కాదని తెలుస్తోంది.
తమిళ సీమ నుంచి ఓ హీరోని ఎంచుకోబోతున్నాడట శంకర్. అలా.. ఈ సినిమాకి తమిళ లుక్ ఇవ్వొచ్చన్నది ప్లాన్. పాన్ ఇండియా సినిమాగా దీన్ని రూపొందిస్తున్నారు. కాబట్టే... తమిళ హీరోని ఎంచుకోనున్నార్ట. అంతే కాదు.. విలన్ కోసం మరో బాలీవుడ్ హీరోని రంగంలోకి దింపుతున్నార్ట. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 150 నంచి 200 కోట్ల వరకూ ఉంటుందని టాక్. మరి ఇందులో... చిరంజీవి అతిథి పాత్ర పోషిస్తాడా? లేదా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.