మ‌న‌సుల్ని గెలుచుకున్న సంజ‌న‌

మరిన్ని వార్తలు

బుజ్జిగాడు హీరోయిన్ సంజన కరోనా కష్టకాలంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆహరం, శాండల్ వుడ్ సినీ కార్మికుల కుటుంబాలకు తాను స్థాపించిన సంజన గల్రాని ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులను సహాయంగా పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ " ‘కోవిడ్‌ భాదితులు మెరైగన ఆరోగ్యంతో కోలుకోవాలని, వారిలో సానుకూలమైన ఆలోచనలను పెంపొందాలని, వారి జీవితాల్లో తిరిగి సంతోషం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

 

తమ జీవితాలను, కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తో పాటుగా కోవిడ్‌ కట్టడిలో భాగస్వామ్యులైన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాస్కులు ధరించడం, ప్రతిరోజు శానిటైజ్‌ చేసుకోవడం, భౌతికదూరం పాటించడం..ఇలా కోవిడ్‌ నియంత్రణ చర్యలను పాటించడం వల్లనే ఈ ప్రపంచం కోవిడ్‌ మహమ్మారినుంచి భయటపడుతుంది.

 

నేను స్థాపించిన సంజన గల్రాని ఫౌండేషన్ ద్వారా ఉడతా భక్తిగా మే 10 నుండి మీ ఇంటి సెల్లార్ లోనే వంట వండించి రోజు 500 మందికి రెండు పూటలా వెజిటేబుల్ బిర్యానీ, పెరుగన్నం, పులిహోర, పెరుగన్నం , బిష్బిళ్ళ బాత్ పెరుగన్నం ఇలా రోజు మెనూ మారుస్తూ పేదవారికి ఆహరం అందిస్తున్నాను. అదేవిధంగా లాక్ డౌన్ కారణంగా రోజు వారి కూలికి పనిచేసే సినీ పరిశ్రమకు చెందిన లైట్ బాయ్స్ , ప్రొడక్షన్ ఫోర్త్ క్లాస్ కార్మికులకు 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులను జూన్ 2న అందించాను.

 

భవిష్యత్‌లో కూడా ఇలాంటి సహాయాలను కొనసాగిస్తాను" అంటూ దయచేసి అందరు ఇంట్లోనే ఉడండి. కోవిడ్‌ నియంత్రణ చర్యలను పాటించండి. పాజిటివ్‌గా ఉండండి కానీ కోవిడ్‌ పాజిటివ్‌ తెచ్చుకోకండి అని పేర్కొన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS