మోహన్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `సన్నాఫ్ ఇండియా`. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ప్రముఖ నటుడు సూర్య ఈ టీజర్ ని విడుదల చేస్తే.. చిరంజీవి వాయిస్ ఓవర్ అందించి - ఈ టీజర్ ని మరో మెట్టు పైకి ఎక్కించారు. ``మన అంచనాలకు అందని ఓ వ్యక్తిని ఇప్పుడు పరిచయం చేయబోతున్నా`` అనే చిరు వాయిస్ ఓవర్ తో టీజర్ స్టార్ట్ అయ్యింది. ``అతడి రూటే అతడి రూటే సెపరేటు`` అంటూ చిరు.. మోహన్ బాబుని ఇమిటేట్ చేయడం ఆసక్తిని కలిగిస్తుంది.
``తను ఎప్పుడు? ఎక్కడ ఉంటాడో? ఎప్పుడు? ఏ వేషంలో ఉంటాడో? ఆ దేవుడికే ఎరుక. తన బ్రెయిన్‌లో న్యూరాన్స్ ఎప్పుడు, ఎలాంటి ఆలోచనలను పుట్టిస్తుందో ఏ బ్రెయిన్ స్పెషలిస్టూ చెప్పలేడు” అని మోహన్ బాబు పాత్ర గురించి చిరు తనదైన స్టైల్ లో ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఈ టీజర్ లో మోహన్ బాబు అనేక గెటప్స్ లో కనిపిస్తున్నారు.
కథాంశం ఏమిటో తెలియలేదు గానీ... మోహన్ బాబుని అనేక రకాలైన పాత్రల్లో చూడొచ్చన్న హింట్ ని మాత్రం టీజర్ ఇచ్చేజిందిప చివర్నో ‘నేను చీకటిలో ఉండే వెలుతురిని.. వెలుతురులో ఉండే చీకటిని’, ‘నేను కసక్ అంటే మీరందరూ ఫసక్’ అంటూ తనదైన శైలిలో డైలాగులు పలికారు కలక్షన్ కింగ్. ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఇళయారాజా సంగీతం అందిస్తున్నారు.