రానా ప్రేమలో పడడం, పెళ్లికి రెడీ అవ్వడం, ఆగస్టులో పెళ్లికి సిద్ధం అవ్వడం.. ఇవన్నీ తెలిసిన విషయాలే. ఆగస్టు 8న రానా - మిహికాల వివాహం జరపాలని ఇరు కుటుంబ సభ్యులూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పెళ్లికి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ఈలోగా.. మరో ఆటంకం. ఈ పెళ్లిని తాత్కాలికంగా వాయిదా వేయాలని ఇరు కుటుంబ సభ్యులూ నిర్ణయించుకున్నారని సమాచారం. దానికి ప్రధాన కారణం కరోనానే.
కరోనా ప్రభావం రోజురోజుకీ పెరుగుతోంది. తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా విశ్వరూపం చూపిస్తోంది కరోనా. హైదరాబాద్‌లో కూడా రోజు రోజుకీ కేసుల సంఖ్య రెట్టింపు అవుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి వాయిదా వేయక తప్పడం లేదని టాక్. అయితే.. పెళ్లికి మరో ముహూర్తం ఏదీ ఇప్పటి వరకూ నిర్ణయించలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ పెళ్లి డిసెంబరులో ఉండొచ్చని తెలుస్తోంది. నిఖిల్ కూడా ముందు ఇలా పెళ్లి వాయిదా వేసుకున్నవాడే. సడన్‌గా పెళ్లి చేసేసుకున్నాడు. మరి రానా ఏం చేస్తాడో చూడాలి.