'అల వైకుంఠపురములో'తో మరో సూపర్ హిట్టు కొట్టాడు త్రివిక్రమ్. ఈ హిట్టు అలాంటిలాంటిది కాదు. ఇండ్రస్ట్రీ రికార్డులన్నింటికీ చెక్ పెట్టింది. ఆల్ టైమ్ సూపర్ హిట్స్ లో 2వ స్థానం ఆక్రమించుకుంది. ఆ తరవాత ఎన్టీఆర్ తో సినిమా ఓకే అయ్యింది. ఈ చిత్రానికి 'అయిననూ పోయిరావలె హస్తినకు' అనే పేరు ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆగస్టులో ఈ సినిమా మొదలు కావాల్సింది. కానీ `ఆర్.ఆర్.ఆర్` షూటింగ్ ఆలస్యం అవ్వడంతో త్రివిక్రమ్ సినిమా కూడా లేట్ అవుతోంది.
ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ప్లాన్ మారినట్టు సమాచారం. ఎన్టీఆర్ రావడానికి లేట్ అవుతుండడంతో, ఈలోగా మరో సినిమాని పట్టాలెక్కించాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఇటీవల ఎన్టీఆర్‌ని కలిసిన త్రివిక్రమ్ ఈ విషయమే చెప్పి ఒప్పించాడట. 'ఆర్.ఆర్.ఆర్' పూర్తయ్యేలోగా మరో సినిమా చేసుకొస్తానని త్రివిక్రమ్ చెప్పాడని, దానికి ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పాడని టాక్. త్రివిక్రమ్ దగ్గర ఇప్పటికే మరో రెండు స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయని, వాటిలో ఒకటి పట్టాలెక్కించడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. సో.. ఆర్.ఆర్.ఆర్ అయ్యేలోగా త్రివిక్రమ్ నుంచి మరో సినిమా రాబోతోందన్నమాట.