బిగ్ బాస్ రియాలిటీ షోపై సీపీఐ నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బిగ్ బాస్ హోస్ ని బ్రోతల్ హోస్ తో పోల్చారు. రియాలిటీ షో పేరుతో నానా చండాలం అంతా తెరపై చూపిస్తున్నారని, ఈ షోని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఐ నారాయణ ముందు నుంచీ బిగ్ బాస్ షోని విమర్శిస్తూనేఉన్నారు. ఇప్పుడు తాజాగా.. బిగ్ బాస్ ఓటీటీలోకి రానుంది. ఈ సందర్భంగా మళ్లీ బిగ్ బాస్ పై తీవ్ర విమర్శలు చేశారు.
బిగ్ బాస్ అనేది గేమ్ షోగా అభివర్ణిస్తున్నారని కానీ, అది లైసెన్స్ పొందిన వ్యభిచార కార్యక్రమం అని మండి పడ్డారు. ఈ షోకి వ్యతిరేకంగా డిజిటల్ క్యాంపెనియింగ్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అసలు ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రయోజనం లేదని, యువతని పక్కదారి పట్టించే ఇలాంటి షోలు అనైతికమని వ్యాఖ్యానించారు. అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి పాత్రలు చేసిన నాగార్జున ఇలాంటి షోలను నిర్వహించడం దారుణమని అభిప్రాయం వ్యక్తం చేశారు.