నాగార్జున `సారీ` చెప్పాల్సిందే!

మరిన్ని వార్తలు

సీపీఐ పార్టీ నేత నారాయ‌ణ‌కు నాగార్జున‌పై కోపం వ‌చ్చింది. `నాగార్జున సారీ చెప్పాల్సిందే` అని ఆయ‌న గ‌ట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఆయ‌న కోపానికి కార‌ణం.. బిగ్ బాస్ షో.

 

బిగ్ బాస్ షో పై ముందు నుంచీ చాలా విమ‌ర్శ‌లు ఉన్నాయి. సంప్ర‌దాయ వాదులు ఈ షో నిర్వ‌హ‌ణ తీరుని త‌ప్పుబ‌డుతున్నారు. ఈ షో వ‌ల్ల ఎవ‌రికీ ఎలాంటి ఉప‌యోగం లేద‌ని, రియాలిటీ షో పేరుతో సంప్ర‌దాయాల్ని మంట‌గులుపుతున్నార‌ని, మ‌హిళ‌ల్ని అవ‌మానిస్తున్నార‌ని వాదిస్తున్నారు. నారాయ‌ణ మాట కూడా అదే.

 

బిగ్ బాస్ 4 సీజ‌న్‌లో ఓ సారి... ముగ్గురు అమ్మాయిల‌ ఫోటోలు చూపిస్తూ... వీరిలో ఎవ‌రిని కిస్ చేస్తావు, ఎవ‌రితో డేటింగ్ చేస్తావు, ఎవరిని పెళ్ళి చేసుకుంటావు అని ఓ కంటెస్టెంట్ ని నాగార్జున అడిగాడు. ఇలాంటి ప్ర‌శ్న‌లు - ఓ షో లో అడ‌గ‌డం మ‌హిళ‌ల్ని అవ‌మానించిన‌ట్టే అని నారాయ‌ణ చెబుతున్నారు. నాగార్జున త‌న ఇంట్లోని మ‌హిళా న‌టుల ఫొటోలు పెట్టి ఇలా అడ‌గ్గ‌లడా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. నాగార్జున అంటే త‌న‌కు చాలా అభిమాన‌మ‌ని, ఆయ‌న సినిమాలు చూస్తాన‌ని చెబుతూనే... ఇలాంటి షోలు నిర్వ‌హించినందుకు ఆయ‌న మ‌హిళా జాతికి, స‌మాజానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. లేని ప‌క్షంలో.. ఈ పోరాటాన్ని ఎంత దూర‌మైనా తీసుకెళ్తాన‌ని చెప్పుకొచ్చారాయ‌న‌. మ‌రి ఈ వివాదాన్ని నాగార్జున ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS