మనిషి అవసరాల కోసమే.. సాంకేతికత. కానీ.. క్రమంగా దాని గుప్పెట్లోకి మనిషి వెళ్లిపోతున్నాడు. ఇది వరకు మన చేతిలో.. సెల్ ఫోన్ ఉండేది. ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలోకే మనిషి వెళ్లిపోయాడు. లేచిన దగ్గర్నుంచి.. మళ్లీ పడుకునేంత వరకూ.. సెల్ ఫోన్ తోనే సావాహం. ఇంటర్నెట్‌తో జహజీవనం. మరీ.. అందులోనే మునిగితేలుతుంటే, భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే ఓ ఊహని.. తెరపైకి తీసుకొస్తే.. అదే `విటమిన్ షి`.
అలెక్సా.. సిరి.. అంటూ.. మనం మనుషులతో తక్కువగానూ, మిషన్లతో ఎక్కువగానూ మాట్లాడేస్తున్నాం. అలా.. సెల్‌ఫోన్‌లో ఓ కొత్త వాయిస్ అసిస్టెంట్ తో పరిచయం చేసుకుంటే - మన సమచారం అంతా ఆ వాయిస్ అసిస్టెంట్ చేతిలో ఉంటే, పరిస్థితి ఏమిటన్న నేపథ్యంతో తెరకెక్కిందే.. `విటమిన్ సి.` త్వరలోనే ఏటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందుకు మచ్చుతునకగా ఏడు నిమిషాల ఎపిసోడ్ ని చిత్రబృందం విడుదల చేసింది. తొలి 7 నిమిషాల్లోనే కథేమిటో తెలిసిపోతోంది. సెల్ ఫోన్ లోని.. వాయిస్ అసిస్టెంట్ తో ఓ యువకుడు చేసిన ప్రయాణం.
అందులో పండే వినోదం, ఆ వినోదం మాటున.. ఉన్న వాస్తవం అన్నీ.. మెల్లమెల్లగా ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఏడు నిమిషాల ఎపిసోడ్ చూస్తుంటే సినిమా మొత్తం చూడాలన్న ఆసక్తి కలుగుతోంది. ఇదే టెంపో.. సినిమా మొత్తం ఉండి ఉంటే... కచ్చితంగా మరి ప్రయత్నంగా మిగులుతుంది. మరి ఈ ప్రయత్నం ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.