క్రేజీ టైటిల్ తో రౌడీ హీరో

మరిన్ని వార్తలు

రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ మూవీతో సందడి చేసిన దిల్ రాజు, విజయ్ దేవరకొండ కాంబో మళ్ళీ రిపీట్ కానుంది అని టాక్. అపజయం లేని రాజు గారు మొదటిసారి పరాజయం చవి చూసారు.  భారీ అంచనాలతో రిలీజైన ఫ్యామిలీ స్టార్ మూవీ డిజిస్టార్ గా నిలిచి, దిల్ రాజు లెక్కల్ని తారు మారు చేసింది.  గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన విజయ్ , పరశురామ్ కాంబోపై నమ్మకంతో దిల్ రాజ్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. కానీ మొదటి సారి నష్టాలు ఎదుర్కొన్నాడు. రిలీజ్ అయ్యి నెలరోజులు కాక ముందే అప్పుడే OTT లోకి కూడా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో రిలీజ్ అయిన తరవాత కావాలనే ఈ మూవీపై నెగిటీవ్ టాక్ తెచ్చారని, ప్లాఫ్ అయ్యేలా చేసారని, మూవీ బానే ఉందని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజం చేస్తూ OOT లో ఈ మూవీ దూసుకుపోతోంది. దిల్ రాజ్ అంచనా ఎప్పుడు తప్పలేదని నిరూపిస్తోంది. ఫ్యామిలీ సినిమాలు తీసి విజయాలు అందుకునే దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ విషయం లో కూడా పాస్ అయ్యాడు. 


ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ తో విజయ్ దేవరకొండతో మరొక సినిమా చేయటానికి దిల్ రాజు ముందుకు వచ్చాడు. ఆల్ రెడీ ఇప్పటికే రెండు, మూడు కథలు ఓకే చేసినట్టు సమాచారం. విజయ్, గౌతమ్ తిన్ననూరి సినిమా కంప్లీట్ అయ్యాక ఈ మూవీ పట్టాలెక్కించే పనిలో ఉన్నారట. ఈ సినిమాకి  ‘రాజా వారు రాణి గారు’ దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కించ నున్నారని,  పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో   నిర్మించనున్నారట. టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ‘రౌడీ జనార్దన్’ అనే టైటిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది. మే 9న విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. 


రౌడీ హీరోకి టైటిల్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిందని, ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.  హీరోయిన్, మిగతా టెక్నీషియన్స్ ,వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సారి ఎలా అయినా సూపర్ హిట్ కొట్టాలని విజయ్ , దిల్ రాజు, గట్టిగా ఫిక్స్ అయ్యారట. ఇందులో భాగంగానే స్క్రిప్ట్, పక్కాగా ప్రిపేర్ చేసుకుంటున్నారంట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS