విష్ణు కోసం రంగం లోకి దిగిన తమన్నా

మరిన్ని వార్తలు

మంచు విష్ణు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప గూర్చి రోజుకొక న్యూస్ ట్రెండింగ్ లో ఉంటుంది. ఈ మూవీలో ఇప్పటికే పలు భాషలకి చెందిన స్టార్స్ ఉన్నారు. కొంత షెడ్యూల్ న్యూజిలాండ్ లో జరిగింది. ప్రస్తుతం ఇండియాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ బడ్జెట్ లెక్కలు కూడా మారుతున్నాయి. విష్ణు ఏ దైర్యంతో ఇంత రిస్క్ చేస్తున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు వీరంతా పాత్రలకి అనుగుణంగా నటిస్తున్నారా, నటనకి స్కోప్ ఉందా, లేదా బజ్ కోసమా అని సందేహం వెలువడుతోంది. ఇప్పుడు కూడా ఈ మూవీకి సంబంధించి మరొక అప్డేట్ వచ్చింది.  


కన్నప్పలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉందని, అందుకోసం మిల్ బ్యూటీ తమన్నాని సంప్రదిస్తున్నట్టు టాక్. ఈ సాంగ్ సినిమాలో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని, అందుకే అది తమన్నా చేస్తే ఇంకొంచెం హైలెట్ అవుతుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట.  తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తే ఆ కిక్కే వేరు. ఇప్పటివరకు ఈ అమ్మడు చేసిన పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి. జైలర్ లో  సాంగ్ అయితే వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందింది అంటే తమన్నా డాన్స్ కారణమని చెప్పొచ్చు. అందుకనే విష్ణు కూడా తమన్నాకే ఓటు వేసాడని తెలుస్తోంది. 


తమన్నా కూడా విష్ణు ఆఫర్ ని కాదనే ఛాన్స్ ఉండదు. టాలీవుడ్ లో  తమన్నా కెరియర్ స్టార్ట్ అయ్యిందే మంచు ఫ్యామిలీ హీరో మనోజ్ తో. కన్నప్పలో ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ చేస్తే ఈ మూవీకి అదనపు ఆకర్షణ అవుతుందని చెప్పొచ్చు. తమన్నా ఎలాంటి డాన్స్ అయినా చేసి  మెప్పించగలదు.  బాహుబలి, సైరా నరసింహ రెడ్డి సినిమాల్లో చేసిన తమన్నా సాంగ్స్ ఇందుకు ఉదాహరణ. ఇదే నిజమైతే  పాన్ ఇండియా రేంజ్ లో మరొకసారి తన డాన్స్ తో సత్తా చూపనుంది తమన్నా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS