ఆ కారు అభిరామ్ ది కాదు

By iQlikMovies - August 13, 2020 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

ద‌గ్గుబాటి సురేష్ త‌న‌యుడు అభిరామ్ కారు ప్ర‌మాదానికి గురైంద‌ని, రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్ లో అభిరామ్ పై కేసు న‌మోదైంద‌ని ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దీనిపై సురేష్ బాబు కుటుంబ స‌భ్యులు స్పందించారు. ఆ కారు అభిరామ్ ది కాద‌ని, అస‌లు ఆ కారుతో త‌మ‌కెలాంటి సంబంధం లేద‌ని, ఇదంతా పుకారే అని కొట్టి ప‌రేశారు. మీడియాలో చూపిస్తున్న కారు అస‌లు ద‌గ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించినది కాద‌నీ వారు స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో ద‌య‌చేసి వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, వాటిని ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని వారు కోరారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS