దాక్కో దాక్కో మేక‌.. పుష్ష వ‌చ్చి కొరుకుతాడు పీక‌

By iQlikMovies - August 02, 2021 - 14:00 PM IST

మరిన్ని వార్తలు

సుకుమార్ సినిమా అంటే అదిరిపోయే పాట‌లు ఉండాల్సిందే. సుకుమార్ కి దేవిశ్రీ ప్ర‌సాద్ ఎప్పుడూ.. అద్భుత‌మైన పాట‌లే ఇచ్చాడు. సుకుమార్ ఫ్లాప్ సినిమాల్లో కూడా సూప‌ర్ హిట్ గీతాలు వినిపిస్తుంటాయి. అదీ.. సుకుమార్ - దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబో అంటే. `నేను శ‌రీరం అయితే.. దేవి ఆత్మ‌` అని సుకుమార్ చాలా సంద‌ర్భాల్లో చెప్పాడు కూడా. అందుకే `పుష్ష‌` సినిమాలోని పాట‌ల‌పై కూడా భారీ అంచ‌నాలు నెల‌కున్నాయి. దేవిశ్రీ మ‌రోసారి సూప‌ర్ హిట్ ఆల్బ‌మ్ ఇస్తాడ‌న్న భ‌రోసాతో ఉన్నారు బ‌న్నీ ఫ్యాన్స్‌. వాళ్ల నిరీక్ష‌ణ ఫ‌లించింది. ఈనెల 13న `పుష్ష‌` నుంచి తొలి పాట రాబోతోంది. `దాక్కో దాక్కో మేక - పులొచ్చి కొరుకుతుంది పీక‌` అంటూ సాగే ఈ పాట‌ని తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చేయ‌బోతున్నారు.

 

5 ప్రధాన భాషల్లో 5గురు ప్రముఖ సింగర్స్ పాడనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. హిందీలో విశాల్ దడ్లానీ.. కన్నడలో విజయ్ ప్రకాశ్.. మలయాళంలో రాహుల్ నంబియార్.. తెలుగులో శివమ్.. తమిళ్ లో బెన్నీ దయాల్ పాడారు. ఈరోజు దేవిశ్రీ ప్ర‌సాద్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా `పుష్ష‌` నుంచి ఏదో ఓ అప్ డేట్ వ‌స్తుంద‌ని అభిమానులు ఆశించారు. దానికి త‌గ్గ‌ట్టే చిత్ర‌బృందం ఊహించ‌ని ట్రీట్ ఇచ్చింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS