బాలీవుడ్ లో మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ గా పేరుగాంచిన ఆమిర్ ఖాన్ ఇప్పుడు రూ 1000 కోట్ల హీరో అయ్యాడు.
మొన్నటివరకు రూ 1000 కోట్ల మార్కెట్ ని అందుకోలేము అనే భావనలో ఉన్న భారతదేశ చలనచిత్ర పరిశ్రమకు బాహుబలి 2 రూపంలో ఒక సమాధానం దొరికింది. ఇప్పుడు ఆ సమాధానానికి బలం చేకూర్చేలా ఆమిర్ ఖాన్ దంగల్ చిత్రం నిలిచింది.
పోయినా వారం చైనా దేశంలో విడుదలైన ఈ చిత్రం, వారం రోజుల్లో రూ 300 కోట్లు కొల్లగోట్టడంతో ఈ చిత్రం కూడా బాహుబలి 2 తో పాటుగా రూ 1000కోట్ల మైలురాయిని దాటిన చిత్రంగా నిలిచింది.
2016లో రిలీజ్ అయిన సమయంలో ఈ చిత్రం రూ 700 కోట్లకు పైగా ఆర్జించి సెకండ్ హైయెస్ట్ ఇండియన్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ 300కోట్లు వచ్చి చేరడంతో హిందీ సినిమాల వరకు రూ 1000 కోట్లుసంపాదించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
ఇవ్వన్ని చూస్తుంటే, 2017 సంవత్సరంభారతీయ చలనచిత్ర పరిశ్రమకి ఒక గుర్తుండిపోయే సంవత్సరంగా మారింది.