వివేక్ ఒబెరాయ్ తాను రీల్ లైఫ్ లోనే కాదు రియల్ హీరో అని నిరూపించుకున్నాడు.
మార్చి 11వ తేదిన చత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన మావోయిస్టుల దాడిలో వీరమరణంపొందిన CRPF జవాన్ల కుటుంబాలకి వివేక్ 25 ఫ్లాట్స్ విరాళంగా ప్రకటించాడు. ఇప్పటికే 4 ఫ్లాట్స్ అందించగా మిగతా 21 ఫ్లాట్స్ అందచేయాల్సి ఉంది.
ఇంతటి విరాళం ప్రకటించినందుకు వివేక్ ఒబెరాయ్ ని CRPF అభినందించింది. ఇదే సంఘటన పై ఇప్పటికే హీరో అక్షయ్ కుమార్, బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తమవంతు విరాళం ప్రకటించారు.
వివేక్ దాతృత్వాన్ని చూసి అందరు అతన్ని రియల్ హీరో గా అభివర్ణిస్తున్నారు.