చిట్టచివరికి 2000 క్లబ్‌లో చేరిన సినిమాగా 'దంగల్' ఘనతకెక్కింది. 'బాహుబలి', దంగల్' సినిమాలు నువ్వా నేనా అంటూ పోటీ పడి, ఇండయన్ సినిమా స్టామినాని 2000 కోట్ల మార్కెట్‌లో నిలిచేలా చేశాయి. అయితే ఆ ఖ్యాతిని తొలిసారిగా 'దంగల్' సినిమా దక్కించుకుంది. 'బాహుబలి' సినిమా 1700 కోట్ల దగ్గర నిలిచి ఉంది. అయితే ఈ సినిమా ఇంకా చైనాలో విడుదల కాలేదు. 'దంగల్' సినిమా చైనాలో విడుదలయ్యాకే ఈ రికార్డును సొంతం చేసుకుంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ సినిమాను చూసి, చిత్ర యూనిట్‌ని ప్రశంసించారు. ఇంతవరకూ ఏ భారతీయ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధించింది లేదు. అందుకే తొలిసారి ఆ ఘనత తెచ్చిపెట్టిన సినిమాగా 'దంగల్' నిలవడం మనకి గర్వ కారణం. అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం రెజ్లింగ్ ప్రధానాంశంగా తెరకెక్కింది. నలుగురు అమ్మాయిలకు తండ్రిగా నటించాడు అమీర్‌ఖాన్ ఈ సినిమాలో. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమీర్ ఖాన్ మల్లయోధుడు మహవీర్ సింగ్ ఫోగట్ పాత్రలో నటించాడు. వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించడమే కాకుండా, అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంది ఈ సినిమా. పలువురు ప్రశంసల్ని దక్కించుకుంది. ఇకపై ఇలాంటి సినిమాలు మరెన్నో తెరకెక్కాలని ఆశిద్దాం.