డేనియల్ వెబర్ ఓ సామాజిక ఘటనకు సంబంధించి నమోపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. నరేంద్రమోడీకి చేత కాకపోతే పదవి నుండి దిగిపోవాలి అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అంతకు ముందు సన్నీలియోన్ కూడా ఈ ఘటనపై స్పందించింది. నా కూతుర్ని ఇంకా దగ్గరగా, ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంది అని ఓ ఫోటో పోస్ట్ చేసింది.
అసలు వివరాల్లోకి వెళితే, ఓ ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి, హతమార్చిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇది సామాజికంగా చాలా తప్పుడు చర్యే. అతి క్రూరమైన చర్చే. అయితే సన్నీలియోన్ కానీ, వెబర్ కానీ ఇండియాలో పుట్టి పెరగలేదు. సినిమా అవకాశాల కోసమే ఇండియాకి వచ్చారు. ఓ దురదృష్టకర సంఘటన జరిగితే, దాన్ని రాజకీయాల కోసం వాడుకోకూడదని సోషల్ మీడియాలో వీరిద్దరినీ కడిగి పారేస్తున్నారు.
బూతు సినిమాల్లో నటించావ్ నువ్వు, మూసుకుని కూర్చో అని వెబర్‌పై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. అసలు నువ్వు భారతీయుడివే కాదు అంటున్నారు. అయితే వెబర్ మాత్రం నేనిప్పుడు భారతీయుడినే అంటున్నాడు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు సమాజంలో వ్యక్తులుగా స్పందించడం సబబుగానే ఉంది. కానీ తమ స్థాయిని మరిచి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఓపెన్ స్టేట్‌మెంట్స్ ఇవ్వడంపైనే ఇప్పుడు రచ్చ జరుగుతోంది.