సిక్స్‌ ప్యాక్‌లో విజయ్‌ దేవరకొండ

మరిన్ని వార్తలు

సంచలన హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'టాక్సీవాలా'. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. 

కండలు తిరిగిన బాడీతో సిక్స్‌ ప్యాక్‌లో విజయ్‌ దేవరకొండ వెనక్కి తిరిగి ఉన్న పోస్టర్‌ అది. విజయ్‌ దేన్నో బలంగా పట్టుకుని పైకి ఎక్కుతుండగా, అతన్ని పట్టుకుని హీరోయిన్‌ ఉన్నట్లుగా ఉంది ఈ పోస్టర్‌. గతంలో పొగలు కక్కే కారు పోస్టర్‌ని విడుదల చేశారు. ఆ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది అప్పట్లో. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ సిక్స్‌ ప్యాక్‌కీ రెస్పాన్స్‌ అదిరిపోతోంది. ఈ సినిమాలో విజయ్‌కి జంటగా ముద్దుగుమ్మ ప్రియాంకా జవాల్కర్‌ నటిస్తోంది.

కొత్తమ్మాయిల్ని పరిచయం చేయడంలో విజయ్‌ దేవరకొండ ముందుంటాడు. 'అర్జున్‌రెడ్డి' సినిమాతో షాలినీ పాండేని పరిచయం చేశాడు. ఆ సినిమా తర్వాత అమ్మడు తెగ పాపులర్‌ అయిపోయింది. వరుస సినిమాల్లో, అందులోనూ ప్రెస్టీజియస్‌ మూవీస్‌లో అవకాశాలు దక్కించుకుంటోంది ఈ బ్యూటీ. అలాగే ప్రియాంక దశ కూడా తిరుగుతుందేమో చూడాలి మరి. 

రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎస్‌.కె.యన్‌. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరో పక్క విజయ్‌ దేవరకొండ కీలక పాత్రలో నటించిన 'మహానటి' చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS