'మహానటి'కి 'మహా' గొప్ప టెక్నీషియన్స్‌

మరిన్ని వార్తలు

సమంత, కీర్తిసురేష్‌, దుల్కర్‌ సల్మాన్‌ ప్రధాన పాత్రల్లో 'మహానటి' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అలనాటి మేటి నటి సావిత్రి జీవిత గాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ నటిస్తోంది. సావిత్రికి అత్యంత సన్నిహితురాలు అలనాటి నటి అయిన జమున పాత్రలో సమంత నటిస్తోంది. హీరోయిన్లలో సావిత్రి జీవిత గాధ చాలా ఒడుదుడుకులతో కూడుకున్నది. ఆమె కెరీర్‌లో ఎన్ని ఉన్నత స్థానాలను చూసిందో, రియల్‌ లైఫ్‌లో అంతకన్నా ఎక్కువ కష్ట నష్టాలను అనుభవించింది. అందులోని ప్రధానాంశాలను ఈ చిత్రానికి స్టోరీగా తీసుకుని సినిమాని తెరకెక్కించనున్నారు. సావిత్రి గురించిన చాలా ఆశక్తికరమైన అంశాలు ఈ సినిమాలో చూపించనున్నారు. ముఖ్యంగా సినిమాని హై టెక్నికల్‌ వేల్యూస్‌తో, ప్యూర్‌ క్వాలిటీతో తెరకెక్కించనున్నారట. అందుకోసం హాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ని తీసుకొచ్చింది చిత్ర యూనిట్‌. హాలీవుడ్‌ ప్రముఖ కెమెరామెన్‌ డానీ సాంషెజ్‌ లోపేజ్‌ ఈ సినిమాకి కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. పలు ఇంటర్నేషనల్‌ యాడ్స్‌, ఇంపార్టెంట్‌ డాక్యుమెంటరీస్‌, మ్యూజిక్‌ వీడియోస్‌ని చిత్రీకరించిన డాని ఈ సినిమాకి మంచి క్వాలిటీ తీసుకురాగలడని నిర్మాత స్వప్నా దత్‌ తెలిపారు. అందుకే ఏరి కోరి ఆయన్ని ఈ సినిమాకి కెమెరామెన్‌గా ఎంచుకున్నామని ఆయన తెలిపారు. నాగ అశ్విన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇంతవరకూ ఏ సినిమాలోనూ చూడనంత హై క్వాలిటీ టెక్నాలజీని ఈ సినిమాలో చూపించబోతున్నారట. అదే 'మహానటి' సినిమా స్పెషల్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS