సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'దర్భార్' చిత్రం సంక్రాంతి బరిలో నిలిచిందన్న సంగతి తెలిసిందే. అయితే, సంక్రాంతి సీజన్‌ని మన హీరోలు అల్లు అర్జున్, మహేష్‌బాబులు ఆల్రెడీ ఆక్యుపై చేసేసినా, అంతకు ముందే రజనీ 'దర్బార్' సంక్రాంతిని టార్గెట్ చేసింది. అనుకున్నట్లుగానే సీజన్ మిస్ కాకుండా, అలా అని, తెలుగు సినిమాలతో క్లాష్ కాకుండా, బెస్ట్ డేట్‌ని రిలీజ్ కోసం ఎంచుకుంది 'దర్బార్' టీమ్. జనవరి 9న 'దర్బార్' ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
సంక్రాంతి సీజన్ ఎన్ని సినిమాలనైనా తట్టుకుని నిలబడగలదు. అయితే, తెలివిగా సూపర్ స్టార్ రజనీకాంత్ లెక్కలేసి మరీ జనవరి 9న వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మాస్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్ సంక్రాంతి సీజన్‌లో వస్తుంటే, బీ,సీ గ్రేడ్ సెంటర్స్‌లో పండగే కదా. ఇకపోతే, ఈ సినిమాకి మురుగదాస్ డైరెక్షన్ మరో స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. ఇప్పటికే విడుదల చేసిన రజనీ కాంత్ పోస్టర్ స్టిల్స్ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తున్నాయి. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేసి, సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. చాలా కాలం తర్వాత రజనీకాంత్ పోలీస్ గెటప్‌లో నటిస్తున్న చిత్రమిది.
డిఫరెంట్ వేరియేషన్స్‌లో డిజైన్ చేసిన పోస్టర్లు సినిమాపై ఉత్కంఠ కలిగిస్తున్నాయి. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న 'దర్బార్' లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందిన సంగతి తెలిసిందే.