వర్మగారు ఎప్పుడు ఎవరిని ఎలా టార్గెట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టార్గెట్ అంటే ఇక్కడ ఆయన సినిమా స్టఫ్ అనే మీనింగ్ మీరు గుర్తించాలి. ఏ అంశాలపై అయితే వివాదాలు నడుస్తాయో వాటినే తన సినిమా స్టఫ్‌గా తీసుకునే వర్మగారి ఖాతాలోకి మరో వివాదాంశం చేరింది. విచిత్రమేంటంటే, వర్మగారు తన ఫ్యూచర్ ప్రాజెక్టులను టైటిల్‌తో సహా అనౌన్స్ చేయడం విశేషం. అఫ్‌కోర్స్ ఆ టైటిల్స్‌లో ఎన్ని పట్టాలెక్కుతాయో, ఎన్ని ధియేటర్స్ వరకూ వస్తాయనేది వర్మగారికెరుక. ఆ విషయం పక్కన పెడితే, ప్రస్తుతం వర్మగారి మెదడులో మెదిలిన తాజా ఆలోచన. 'హైద్రాబాదీ దాదాస్'. ఇదే టైటిల్‌తో తాజాగా ఆయన కొత్త సినిమా అనౌన్స్ చేశారు.
'కమ్మ రాజ్యంలో కడపరెడ్లు' అనే సినిమా ప్రస్తుతం ధియేటర్‌లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఆన్ ది వేలో ఉండగానే, 'రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్' అంటూ ఇటీవలే ఈ సినిమాకి సీక్వెల్ అంటూ ఇంకో సినిమా అనౌన్స్ చేసి పాడేశారు. వెరీ లేటెస్ట్‌గా వర్మ గారి నుండి అనౌన్స్ అయిన మరో జాతి ముత్యమే 'హైద్రాబాదీ దాదాస్'. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఓ నిజ జీవిత పాత్రను ఈ సినిమాలో చూపించబోతున్నారట. అన్నట్లు ఈ సినిమాకి లీడ్ రోల్ పోషించే ఆర్టిస్ట్‌ని కూడా ముందే వెతికి పట్టేసుకున్నారు. మరెవరో కాదు, సందీప్ మాధవ్. ప్రస్తుతం 'జార్జిరెడ్డి' సినిమాతో ఈయన గారి పేరు మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. అందుకే ఆయనే మన వర్మగారి సినిమాకి లీడ్ యాక్టర్. అఫ్‌కోర్స్.. వర్మగారి కంపెనీ నుండి పరిచయమైన ఆర్టిస్టే ఈ సందీప్ మాధవ్.