రెడ్‌ హాట్‌ 'ఆటగత్తె'

By iQlikMovies - July 10, 2018 - 12:32 PM IST

మరిన్ని వార్తలు

అహా వాట్‌ ఏ హాట్‌ అప్పీల్‌ అనిపిస్తోంది కదా.. ఈ ఫోటో చూస్తే, అమ్మడు ఎవరంటే 'ఆటగాళ్లు' సినిమాలో హీరోయిన్‌. పేరు దర్శనా బానిక్‌. నారా రోహిత్‌, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సినిమా ఇది. హా.! గుర్తొచ్చింది అనుకుంటున్నారా? అవును ఈ మధ్య టీజర్‌లో చూశారు కదా అమ్మడి హాట్‌ అప్పీల్‌. తొలి సినిమాకే ఈ రేంజ్‌లో హాట్‌ ప్రదర్శనిచ్చేసింది. చిత్ర యూనిట్‌ కూడా పాపం దాచుకోకుండా, టీజర్‌లోనే శాంపిల్‌గా ఈ ముద్దుగుమ్మ అందాల దాడిని రిలీజ్‌ చేసేశారు. ఇక సినిమాలో ఏ స్థాయిలో చూపిస్తుందో చూడాలి మరి. ఇకపోతే సోషల్‌ మీడియాలోనూ అమ్మడు యాక్టివ్‌గానే ఉంటుందండోయ్‌. చూస్తున్నారుగా రెడ్‌ హాట్‌ కాస్ట్యూమ్‌లో దర్శనా అందాల దర్శనాలు. ఇంకెందుకాలస్యం లెట్స్‌ ఫాలో హెర్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS