రేష్మీలోని కొత్త రొమాంటిక్‌ యాంగిల్‌.!

మరిన్ని వార్తలు

ఎక్స్‌పోజింగ్‌లో రేష్మీ అస్సలు మొహమాటపడదు. స్క్రీన్‌ ఏదనీ ఆలోచించదు. బుల్లి స్క్రీన్‌పైనే ఓ రేంజ్‌లో అందాలారేసే రేష్మీ, ఇక బిగ్‌ స్క్రీన్‌పై స్క్రీన్‌కి తగ్గట్లుగా చూపించాలి కదా. అందుకే అస్సలు ఏమాత్రం తగ్గదు. 

తాజాగా రేష్మీ 'అంతకుమించి' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. జై హీరోగా నటిస్తున్నాడు. జానీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదో హారర్‌ మూవీ. అయితేనేం. హారర్‌తో భయపెడుతూనే, తన అందాలతో మురిపించబోతోందనీ తాజాగా విడుదలైన టీజర్‌ ద్వారా చెప్పకనే చెప్పింది రేష్మి. ఇంతవరకూ రేష్మీ నటించిన అన్ని సినిమాల్లోనూ గ్లామర్‌ దాడి కూసింత ఎక్కువే. అయితే వాటన్నింట్లోకీ ఈ సినిమాలో టైటిల్‌కి తగ్గట్లుగా అందాల దాడి ఉండబోతోందట. 

అసలు 'అంతకు మించి' అనే టైటిల్‌ హారర్‌ ఎపిసోడ్‌ కోసం పెట్టారా? లేక రేష్మీతో హీరో రొమాంటిక్‌ సీన్స్‌ కోసం పెట్టారా? అనేది కన్‌ఫ్యూజన్‌లో ఉన్న పాయింట్‌. ఓ పక్క హాట్‌ హాట్‌ రేష్మీ సోయగాలను చూపిస్తూనే, మరోవైపు అంతకు మించిన స్థాయిలో హారర్‌ అంశాలతో భయపెట్టేస్తున్నారు. ఏది ఏమైనా రేష్మీ అంటేనే స్పెషల్‌. హారర్‌ సబ్జెక్ట్స్‌ను ఎంచుకుంటూనే, తనకి అసలు సిసలు అస్త్రమైన గ్లామర్‌తో కట్టి పడేస్తూ ఉంటుంది. 

ఇదిలా ఉంటే, రేష్మీకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం రేష్మీ సరికొత్తగా ప్లాన్‌ చేస్తోందట. అదేంటో ప్రస్తుతానికి సస్పెన్స్‌ అట కానీ, తొందర్లోనే రివీల్‌ చేస్తుందట. అంతవరకూ వెయిట్‌ చేయాల్సిందే తప్పదు మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS