దక్షిణాది చిత్రాలు ఇటీవల హిందీ చిత్రసీమ బాక్సులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్, కాంతార అక్కడ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. దాంతో సౌతిండియన్ సినిమాలపై బాలీవుడ్ మరింత ఫోకస్ పెట్టింది. ఇప్పుడు వాళ్ల దృష్టి `దసరా`పై పడింది.
నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం `దసరా`. కీర్తి సురేష్ కథానాయిక. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. నార్త్ బెల్ట్ లో థియేటరికల్ రైట్స్ కూడా హాట్ కేకుల అమ్ముడుపోయాయి. ఈ సినిమాని రూ.12 కోట్లకు అనిత్ తదాని సొంతం చేసుకొన్నట్టు టాక్. నాని సినిమాకి అక్కడ రూ.12 కోట్లు పలకడం అంటే పెద్ద విషయమే. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగే సినిమా ఇది. నార్త్ తో ఇలాంటి వాతావరణమే తెలీదు. కాకపోతే... కేజీఎఫ్ కూడా ఇలానే రా సినిమా. కాంతారా కూడా అంతే. అవి బాగా ఆడాయి.
సో.. దసరా కూడా ఆడుతుందన్న నమ్మకం బాలీవుడ్ కి కుదిరింది. మిగిలిన సౌత్ ఇండియన్ భాషలైన తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఎంతకి అమ్ముడుపోతుందో చూడాలి. వాటికీ మంచి రేటొస్తే.. విడుదలకు ముందే.. దసరా సేఫ్ జోన్‌లో పడిపోయినట్టు. తెలుగులో థియేటరికల్ రైట్స్ మొత్తం దిల్ రాజు చేతిలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.