దాసరి ఆకస్మిక మరణంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటుగా ఆయన కుటుంబం కూడా పెద్దదిక్కుని కోల్పోయింది.
ఈ సందర్భంలో ఆయన రెండవ కుమారుడు దాసరి అరుణ్ కుమార్ కొన్ని విషయాలు తెలుగు ప్రేక్షకులతో పంచుకున్నాడు. అదేంటంటే- దాసరి గారు తనని ఎప్పుడు సినిమాలు చెయ్యరా.. ఎదగాలి అని అనేవారట. కాని తనేమో నటన పైన అంత ఆసక్తి చూపకపోవడంతో తన కెరీర్ సరైన మార్గంలో వెళ్ళలేదు అని చెప్పాడు.
అయితే ఇప్పుడు మాత్రం నటన మీద దృష్టి పెట్టాలనుకుంటున్నట్టు తన మనసులో మాట బయటపెట్టాడు. కాకపోతే హీరోగానే కాకుండా మంచి క్యారెక్టర్ రోల్స్ తో పాటుగా విలన్ రోల్స్ చేయడానికి కూడా తను సిద్ధం అని ప్రకటించేశాడు.
మరి.. దాసరి కిరణ్ కుమార్ నటనలో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు అనే విషయం స్పష్టమయింది.