సూపర్ స్టార్ గా మహేష్ బాబు అందరికి సుపరిచితమే. అయితే ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి మనిషి, తన కుటుంబసభ్యులతో ఎలా ఉంటాడో మనలో చాలా మందికి తెలియదు.
అయితే ఈ విషయాలని మహేష్ భార్య నమ్రత, ఆయన పిల్లలు- గౌతం, సితారలు బయటపెట్టారు. అందులో కొన్ని మీకోసం-
మహేష్ తన పిల్లలతో డాడీ అని కాకుండా నాన్న అని పిలిపించుకోవడానికి ఇష్టపడతాడట. చిన్నపటినుండి అదే అలవాటు చేశాడట!
మార్కులు తక్కువ వచ్చినా, బాగా అల్లరి చేసినా లేక ఇంకేదైనా గొడవ చేసిన పిల్లలని ఏమాత్రం కూడా కోప్పడడట.
ఏ కొంచెం సమయం దొరికినా కుటుంబంతో, పిల్లలతో గడపడానికే ఆసక్తి చూపుతాడట.
ఇక నమ్రత కూడా మహేష్’ గురించి చెబుతూ- పెళ్ళికి ముందు కాని తరువాత కాని ఎటువంటి ఆంక్షలు పెట్టలేదట. తన తల్లిదండ్రులు చనిపోయిన షాక్ నుండి తెరుకోవడంలో మహేష్ ఇచ్చిన మెంటల్ సపోర్ట్ చాలా ఉంది అని చెప్పింది.
మహేష్ మంచి భర్తే కాకుండా, మంచి తండ్రి అలాగే ఓ మంచి కొడుకు అని సూపర్ స్టార్ నిజంగా రియల్ లైఫ్ సూపర్ స్టార్ అని తేల్చి చెప్పింది.