మళ్ళీ ఆసుపత్రికి దాసరి?!

మరిన్ని వార్తలు

దర్శకరత్న దాసరి నారాయణ రావు మళ్ళీ ఆసుపత్రి లో చేరినట్టు సమాచారం!

ఆయన ఈ మధ్యనే చాలా కాలం పాటు అన్నవాహికలో ఏర్పడిన సమస్య కారణంగా KIMS ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే ఆ సమస్య మళ్ళీ తిరగపెట్టడంతో ఆయన రెండు మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారట.

ఇక ప్రస్తుతం ఆయనకు డయాలసిస్ చేస్తున్నట్టు సమాచారం, ప్రస్తుతం ఆ ప్రక్రియ ముగిసిన తరువాతే ఆయన ఆరోగ్య పరిస్థితి పై ఒక అంచనాకు వస్తామని డాక్టర్లు చెప్పినట్టు వినికిడి.

అయితే ఇప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని ఆయన సన్నిహితులు, అభిమానులు ప్రార్ధిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS