రకుల్‌ ప్రీత్ ఫెయిల్‌, పూజాహెగ్దే పాస్‌.!

By iQlikMovies - March 27, 2019 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

ఈ పాస్‌, ఫెయిల్‌ అనేది ఏదో పూజా, రకుల్‌ ప్రీత్‌ ఎగ్జామ్స్‌కి సంబంధించిన మ్యాటర్‌ ఎంతమాత్రమూ కాదండోయ్‌. పూజా హెగ్దే ప్రస్తుతం తెలుగులో 'మహర్షి' సినిమాలో నటిస్తోంది. రకుల్‌ బాలీవుడ్‌లో 'దే దే ప్యార్‌ దే' సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాల పరంగా, అసలు వీరిద్దరికీ సంబంధమే లేదు. ఏంటి మరి ఈ పాస్‌ ఫెయిల్‌ రిలేషన్‌షిప్‌ అంటే.. ఇటీవల 'దేదే ప్యార్‌ హై' మూవీకి సంబంధించి బాలీవుడ్‌లో ఓ పోస్టర్‌ విడుదలైంది. ఆ పోస్టర్‌లో హీరో అజయ్‌ దేవగన్‌ రెండు కార్లపై చెరో కాలూ బార చాపి కనిపిస్తాడు.

ఓ కారుపై టబు, ఇంకో కారుపై రకుల్‌ ఉంటారు. అంటే అప్పుడెప్పుడో మన వెంకీ నటించిన 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' బాపతు సినిమా అన్నమాట ఇది.. అని అర్ధమైపోయే ఉంటుంది. సరే ఇప్పుడు టాపిక్‌ ఈ సినిమా కాదు, అజయ్‌దేవగన్‌ చేసిన ఆ ఫీట్‌. ఆ ఫీట్‌ ట్రై చేయడానికి రకుల్‌ అష్ట కష్టాలూ పడిందట. కానీ ఫెయిలైందట. ఎప్పుడూ జిమ్‌లో కసరత్తులు చేసే రకుల్‌ వల్ల కాలేదట అలా రెండు కాళ్లూ నేలకు సమాంతరంగా చాపడం. కానీ పూజా హెగ్దే, అరటిపండు తొక్క ఒలిచినంత ఈజీగా చేసేసింది. ఆ పిక్‌ కావాలంటే పూజా ఇన్‌స్టాలో చెక్‌ చేసుకోండి. కానీ ఆ పిక్‌ చూస్తే తెలుస్తుంది పూజాది ఎంత ఫ్లెక్సిబుల్‌ బాడీనో అని.

గతంలో గాలిలో ఎగురుతూ శరీరాన్ని అందమైన విల్లులా వంచేసి బాణం సంధించిన పిక్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది గుర్తుండే ఉంటుంది కదా. ఇప్పుడీ తాజా పిక్‌ వైరల్‌ అయ్యింది. ఏది ఏమైనా పూజా.. యు ఆర్‌ సో గ్రేట్‌ యా.! అని మురిసిపోతున్నారు ఆమె అభిమానులు. అయితే ఎప్పుడూ ఫిట్‌నెస్‌ పాఠాలు వల్లె వేసే రకుల్‌కి ఇలా చేయడం వల్ల కాలేదెందుకో మరి.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS