యంగ్ హీరో విజయ్ దేవరకొండ మామూలోడు కాదండోయ్. తాజాగా 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తున్నాడీ ఈ సెన్సేషనల్ హీరో. అయితే 'డియర్ కామ్రేడ్' అనే టైటిల్‌ని బట్టి ఇదేదో విప్లవాత్మక చిత్రంగా భావించారు. కానీ కాదట. అయితే ఆ తర్వాత 'అర్జున్‌రెడ్డి' సినిమా తరహాలో ఉండొచ్చునేమో అని ఊహించారు. అదీ కాదట. ఇదో క్యూట్ లవ్‌స్టోరీ అట. ప్రేమ కోసం పోరాడే యువకుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడట.
'డియర్ కామ్రేడ్' ఫైట్ ఫర్ వాట్ యూ లవ్' అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సామాజికి బాధ్యత గల యువకుడిగా కనిపించబోతున్నాడట. అంతేకాదు, అసలు సిసలు ట్విస్ట్ ఏంటంటే ఇంతవరకూ పక్కా తెలంగాణా యాసతో డిఫరెంట్ ఆటిట్యూడ్‌ని ప్రదర్శించిన మనోడు ఇప్పుడు పక్కా ఆంధ్రా అబ్బాయిగా మారిపోతున్నాడట ఈ సినిమా కోసం. తూర్పు గోదావరి జిల్లా తొండంగిలో ఈ సినిమా షూటింగ్ లేటెస్టుగా స్టార్ట్ అయ్యింది.
ఆ చుట్టుపక్కల పరిసరాల్లోనే ఎక్కువగా చిత్రీకరణ జరపనున్నారట. అందుకోసం మనోడు తెలంగాణా యాసని పక్కన పెట్టి, ఫస్ట్ టైం ఆంధ్రా యాసపై దృష్టి పెట్టబోతున్నాడట. ఇంతవరకూ విజయ్ దేవరకొండ అంటే పక్కా తెలంగాణా కుర్రోడు. తెరపై ఎలా కనిపిస్తాడో బయట కూడా అలాగే ఉంటాడు అన్న ఇమేజ్ కాస్త ఛేంజ్ కానుంది ఈ సినిమాతో. 'గీతా గోవిందం' పెయిర్ మరోసారి ఈ సినిమాలో రిపీట్ కానుంది. కన్నడ బ్యూటీ రష్మికా ఈ సినిమాలో విజయ్‌తో జత కట్టనుంది. మరోవైపు 'గీత గోవిందం' త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.