సర్‌ప్రైజింగ్‌ టైటిల్‌తో మహేష్‌ కొత్త సినిమా.!

By iQlikMovies - August 07, 2018 - 10:51 AM IST

మరిన్ని వార్తలు

వంశీ పైడిపల్లి - మహేష్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న కొత్త చిత్రానికి టైటిల్‌ ఏంటనే విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా ఒక్కొక్క అక్షరం చొప్పున విడుదల చేస్తూ మహేష్‌ టైటిల్‌పై ఆశక్తిని పెంచేస్తున్నారు. ఇంతవరకూ విడుదలైన 'ఆర్‌', 'ఐ', 'ఎస్‌', 'హెచ్‌' ఈ నాలుగు అక్షరాలతోనూ వచ్చే టైటిల్‌ 'రిషి' అంటూ అభిమానులు కొన్ని డిజైన్లు తయారు చేస్తున్నారు సోషల్‌ మీడియాలో. అయితే తాజాగా విడుదలైన లెటర్‌ 'హెచ్‌'తో పాటు, 'ఐ' అనే లెటర్‌ కూడా వచ్చింది.

 

కానీ ఈ సినిమా టైటిల్‌ 'కృష్ణ' అంటూ మాట్లాడుకుంటున్నారు. అంటే విడుదలైన లెటర్స్‌ని ఆర్డర్‌లో కాకుండా, కాస్త జంబుల్డ్‌ చేస్తే 'కృష్ణ' అనే టైటిల్‌ కూడా రావచ్చునేమో. కానీ తాజాగా విడుదైన 'ఐ' లెటర్‌తో 'కృష్ణ' అనే టైటిల్‌కి చెక్‌ పెట్టినట్లవుతోంది. ఏది ఏమైనా టైటిల్‌కి సంబంధించినంత వరకూ ఇదో సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌ అనుకోవచ్చు. ఈ సస్పెన్స్‌కి తెర పడాలంటే ఈ నెల 9 వరకూ ఆగాల్సిందే. ఆ రోజు మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌తో కూడిన టైటిల్‌ లోగో విడుదల చేయనున్నారు.

 

'స్పైడర్‌' సినిమాతో నిరాశపరిచిన మహేష్‌బాబు 'భరత్‌ అనే నేను' సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్‌ చేసేశాడు. ఇప్పుడు రాబోతున్న ఈ కొత్త సినిమాతో ముందే ఇంత ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తున్నాడు. 'ఎవడు', 'ఊపిరి' తదితర చిత్రాల ద్వారా డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌ని పరిచయం చేసి, హిట్స్‌ అందుకున్న డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి. ఈ సారి మహేష్‌ సినిమాతో సరికొత్త మ్యాజిక్‌ ఏదో చేయబోతున్నాడన్న సంగతి ముందే తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 'ఊపిరి' సినిమాలో నాగార్జుననీ, తమిళ హీరో కార్తీని మ్యాచ్‌ చేసి, ఎక్కడో.. టచ్‌ చేసిన, వంశీ పైడిపల్లి తాజాగా అల్లరోడిని, సూపర్‌స్టార్‌నీ ఎలా మ్యాచ్‌ చేస్తాడో చూడాలి మరి


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS