కిర్రాక్‌ రేంజ్‌లో 'రౌడీ' ప్రమోషన్స్‌!

మరిన్ని వార్తలు

సినిమాలు చేయడమే కాదు, ఆ సినిమాల్ని ఎలా మార్కెట్‌ చేసుకోవాలో కూడా బాగా తెలిసినోడు మన రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ. 'డియర్‌ కామ్రేడ్‌' సినిమాని కనీ వినీ ఎరుగని రీతిలో ప్రమోట్‌ చేస్తున్నాడు. సౌత్‌లోని నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి నాలుగు భాషల్లోనూ విసృతంగా ప్రమోషన్స్‌ చేస్తున్నాడు విజయ్‌ దేవరకొండ. ప్రమోషన్స్‌లో భాగంగా ఆయా చోట్ల మ్యూజిక్‌ ఫెస్టివల్‌ పేరుతో ఈవెంట్స్‌ నిర్వహిస్తున్నారు. లేటెస్ట్‌గా బెంగుళూర్‌లో జరిగిన ఈవెంట్‌కి కన్నడ స్టార్‌ హీరో యష్‌ ముఖ్య అతిధిగా విచ్చేశాడు.

 

'కేజీఎఫ్‌' సినిమాతో సెన్సేషనల్‌ అయిన యష్‌ అటెండ్‌ కావడంతో ఈ ఈవెంట్‌కి అదనపు గ్లామర్‌ యాడ్‌ అయ్యింది. ఫ్యాన్స్‌లో విపరీతమైన జోష్‌ నింపాడు యష్‌. నెక్స్ట్‌ జరగబోయే మ్యూజికల్‌ ఫెస్ట్‌ కొచ్చిలో జరగనుంది. ఈ ఈవెంట్‌కి దుల్కర్‌ సల్మాన్‌ హాజరవ్వనున్నాడనీ తెలుస్తోంది. మలయాళ వెర్షన్‌ ట్రైలర్‌ ఈయన చేతుల మీదే విడుదలైన సంగతి తెలిసిందే. 'మహానటి' సినిమా దగ్గర నుండీ, దుల్కర్‌, విజయ్‌ దేవరకొండల మధ్య మంచి స్నేహం ఉంది. ఆ స్నేహంతోనే 'డియర్‌ కామ్రేడ్‌' ప్రమోషన్స్‌లో తానూ భాగమయ్యాడు. ఇక తర్వాత చెన్నైలో జరగబోయే ఈవెంట్‌కి సూర్య అటెండ్‌ అవ్వనున్నాడనీ సమాచారం. ఇక చిట్ట చివరిగా హైద్రాబాద్‌లో జరగనున్న ఈవెంట్‌కి సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హాజరు కానున్నాడనీ తెలుస్తోంది.

 

ఈ మధ్య మహేష్‌ నటించిన 'మహర్షి' సినిమా ప్రమోషన్స్‌లో విజయ్‌ దేవరకొండ స్పెషల్‌గా సందడి చేసిన సంగతి తెలిసిందే. సో ఇప్పుడు రౌడీ టైమొచ్చింది. ఈ తరుణంలో ఈ నెల 19న జరగబోయే 'డియర్‌ కామ్రేడ్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి మహేష్‌ హాజరు కానున్నాడనీ టాక్‌ వినిపిస్తోంది. అలా మొత్తం నాలుగు భాషల్లోనూ 'డియర్‌ కామ్రేడ్‌' ప్రమోషన్స్‌ ఫుల్‌ హుషారుగా ప్లాన్‌ చేశారు రౌడీ అండ్‌ టీమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS