లేటెస్ట్గా విడుదలైన 'డియర్ కామ్రేడ్' ట్రైలర్ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్ అయిపోయింది. 5 మిలియన్లు పైగా వ్యూస్ సాధించి రికార్డులు సృష్టిస్తోంది. విజయ్ దేవరకొండ సినిమా అంటేనే సెన్సేషన్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా తయారైంది ఇప్పుడు పరిస్థితి. ఇక దాదాపు ఏడాదికి పైగా టైం తీసుకుని చేసిన 'డియర్ కామ్రేడ్'పై భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే ప్రమోషన్స్ కూడా ఓ పద్ధతిగా ఫాలో చేస్తున్నాడు మన కామ్రేడ్.
మొన్న వచ్చిన రొమాంటిక్ టీజర్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. సాంగ్ ప్రోమోస్తోనూ అంచెలంచెలుగా అంచనాలందుకున్నాడు. ఇక ట్రైలర్‌తో అస్సలేమాత్రం తగ్గలేదు. ఇంత వరకూ ఉన్న అంచనాలు ఆకాశాన్నంటేలా దిమ్మ తిరిగే కిక్ ఇచ్చాడు మన రౌడీస్టార్ విజయ్ దేవరకొండ. అందుకే ఈ ట్రైలర్‌ని పదే పదే చూస్తూ కోట్లలో వ్యూస్ కట్టబెడుతున్నారు ఆయన ఫ్యాన్స్. తెలుగుతో పాటు మొత్తం నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదలవుతుండడం విశేషం. మ్యూజిక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.
టెంట్లో తనకు సెట్ అయ్యే రొమాంటిక్ యాంగిల్నీ, లిప్‌లాక్ స్టఫ్‌ని దిట్టంగా మిక్స్ చేసినట్లు ట్రైలర్ చెప్పేస్తోంది. రష్మికాని ఈ సినిమాలో క్రికెట్ ప్లేయర్‌గా చూపిస్తున్న సంగతి తెలిసిందే. 'గీత గోవిందం'తో సెన్సేషనల్ పెయిర్ అనిపించుకున్న ఈ పెయిర్ మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేసేలానే ఉన్నారు. ట్రైలర్ వచ్చాక రౌడీస్‌లో ఉత్కంఠ మరీ పెరిగిపోయింది. కానీ తప్పదు. ఆ ఉత్కంఠను అలాగే మరి కొద్ది రోజులు దాచి పెట్టాల్సిందే. జూలై 26న 'డియర్ కామ్రేడ్' ప్రేక్షకుల ముందుకు రానుంది.