సారా జైన్.. ఈ పేరు మీకు సుపరిచితమే. పవన్ కళ్యాణ్‌తో 'పంజా' సినిమాలో నటించిన ముద్దుగుమ్మ పేరే సారా జైన్. ఆ సినిమా తర్వాత ఈ బ్యూటీ మరో సినిమాలో కనిపించింది లేదు. కానీ, సోషల్ మీడియాలో పిసరంతైనా కండ లేని అదేలెండి సున్నా సైజ్ ఫిజిక్‌తో అందాలారబోసేస్తూ తెగ పోజులిచ్చేస్తుంటుంది.
ఆ జీరో సైజ్ ఫిజిక్‌కి బికినీ డిజైన్ చేసిన ఆ డిజైనర్ ఓపికకు మెచ్చుకోవాలనిపిస్తుంది ఈ అమ్మడి బికినీ సొగసులు చూస్తుంటే. చూస్తున్నారుగా.. తాజా పిక్‌లో. స్కై బ్లూ కలర్ పూల డిజైన్‌లో ఉన్న బికినీలో అమ్మడి అందాలు. పెద్దగా వల్గారిటీ ఏమీ కనిపించడం లేదు. కానీ, అమ్మడి తొడల సౌందర్యం మాత్రమే ఇక్కడ ఎలివేట్ అవుతోంది.
హైనెక్, ఫుల్ హ్యాండ్స్‌తో టాప్ పార్ట్ మొత్తం కవర్ చేసేసింది. టార్చ్‌లైట్ వేస్తే ఆ సన్నని నడుం ఎక్కడ కనిపించదనుకున్నారో ఏమో, ఏకంగా సూర్యారావ్ దగ్గర నుండి సన్‌లైట్‌ని అప్పు తెచ్చుకున్నట్లున్నారు. సన్న సన్నని నడుంపై సూటిగా పడుతున్న సూర్యకాంతికి ఆ నడుమొంపులు సొంపుగా కనిపింస్తుంటే, అమ్మడిచ్చిన పోజు మోడ్రన్ అజంతా శిల్పాన్ని తలపిస్తోంది.
ఇక యాక్సెసరీస్ విషయానికి వస్తే, కళ్లకు గాగుల్స్ పెట్టి, సుతారంగా వదిలేసిన కురులన్నీ ఒకే వైపు పోగేసి పక్కకు చూస్తున్న ఈ అజంతా శిల్ప సౌందర్యాన్ని, ఇంకో పక్కన పసుపు, ఎరుపు రంగు పూలతో అలంకరించిన పూల కుండీ మరింత రెట్టింపు చేస్తోంది.