ఎన్టీఆర్ బుల్లితెర గేమ్ షో 'బిగ్‌బాస్'లోకి మరో గ్లామర్ యాడ్ అయ్యింది. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. 'గోపాల గోపాల' చిత్రంలో గోపికా మాత గెటప్‌లో కనిపించి ఎట్రాక్ట్ చేసింది. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో నాగార్జున మరదలుగా నటించింది ఈ ముద్దుగుమ్మ. 'బంతి పూల జానకి'లో ధన్‌రాజ్‌కి జోడీగా నటించింది. ఆమె ఎవరో అర్ధమయ్యే ఉంటుంది కదా. దీక్షా పంథ్. క్యూట్ అండ్ హాట్ గ్లామర్ అమ్మడిది. ఇప్పుడు బుల్లితెరపై అమ్మడు తన గ్లామర్‌తో ఆకట్టుకోనుంది. వైల్డ్ కార్ట్ ఎంట్రీ ద్వారా 'బిగ్‌బాస్' షోలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. వస్తూ వస్తూనే స్విమ్మింగ్ పూల్‌ని యూజ్ చేసిందని అంటున్నారు. అంటే 'బిగ్‌బాస్'కి గ్లామర్ ఓ రేంజ్‌లో ఉండబోతోందనే సంకేతాలు అందుతున్నట్లే అమ్మడి రాకతో. పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకి అంతగా గుర్తింపు రాలేదు. కానీ 'బిగ్‌బాస్' షోతో గుర్తింపు తెచ్చుకుంటుందేమో చూడాలి. మరో పక్క వీక్ అంతా సెలబ్రిటీస్‌తో డల్‌గా నడుస్తున్న ఈ షోకి వీకెండ్స్ మాత్రం ఫుల్ జోష్ యాడ్ అవుతోంది. ఎన్టీఆర్ తనదైన శైలితో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ తూటాల్లాంటి పంచ్‌లు ఇస్తూనే, ఆహ్లాదంగా తాను నవ్వుతూ, ఆడియన్స్‌ని నవ్విస్తూ, సరదా సరదాగా ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే 14 మంది సెలబ్రిటీస్‌లో జ్యోతి, మధుప్రియ ఎలిమినేట్ కాగా, సంపూర్ణేష్ బాబు మధ్యలోనే వెళ్లిపోగా, కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటీ దీక్షా పంథ్‌తో ఈ వీక్ 'బిగ్‌బాస్' షో ఎలా ఉండబోతోందో చూడాలిక.