డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ ని కుదిపేస్తోంది. ఒకరి తరవాత.. ఒకరి పేరు. అంతా టాప్ మోస్ట్ సెలబ్రెటీలే. తాజాగా ఈ వ్యవహారంలో దీపికా పదుకొణే పేరు కూడా బయటకు వచ్చింది. త్వరలోనే ఎన్‌సీబీ అధికారులు దీపికాకు సమన్లు జారీ చేసే అవకాశం ఉందని టాక్. డ్రగ్స్ కేసులో మరో రెండు ముఖ్యమైన పేర్లు బయటకు వచ్చాయని, వాటిని డీ, కె లుగా అభివర్ణిస్తూ.. వార్తా సంస్థలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఇందులో డి అంటే దీపికా అని, కె అంటే ఆమె మేనేజర్ కరిష్మా అని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
వీరిద్దరికీ అధికారులు సమన్లు జారీ చేశారని, విచారణ అధికారుల ముందు హాజరై, వీరిద్దరూ వివరణ ఇచ్చుకోవాల్సివుందని తెలుస్తోంది. ఇటీవల ఇదే కేసులో అరెస్టు అయిన రియా చక్రవర్తి కొంతమంది బాలీవుడ్ సెలబ్రెటీల పేర్లు బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఆ లిస్టు ప్రకారమే దీపికా పేరు బయటకు వచ్చిందని తెలుస్తోంది. దీపికా లాంటి స్టార్లకే ఈ సెగ తగిలిందంటే - మిగిలిన వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్రగ్స్ అలవాటున్న హీరోలు.
హీరోయిన్లు, దర్శకులు, మిగిలినవాళ్లు... ఇప్పుడు వణికిపోతున్నారు. ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందో చెప్పలేని పరిస్థితి. మరి ఈ విషయంలో దీపికా ఏముంటుందో? తన వాదన ఎలా వినిపించుకుంటుందో చూడాలి.