అల వైకుంఠపురములో సినిమాతో తన మ్యాజిక్ చూపించాడు త్రివిక్రమ్. ఆ వెంటనే ఎన్టీఆర్ తో సినిమా ఓకే చేసేసుకున్నాడు. కానీ.. లాక్ డౌన్‌తో ప్లానింగ్ అంతా మారిపోయింది. `ఆర్.ఆర్.ఆర్` ఆలస్యం అవ్వడంతో.. త్రివిక్రమ్ ప్రాజెక్టు ఆలస్యం అయ్యింది. ఈలోగా మరో సినిమా చేయాలన్నది త్రివిక్రమ్ ప్లాన్. అందుకోసం చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు. అందుబాటులో ఉన్న ఆప్షన్లన్నీ వెదుకుతున్నాడు.
త్రివిక్రమ్ తో పనిచేయడానికి పెద్ద హీరోలు రెడీగా ఉన్నా, వాళ్లెవ్వరూ ప్రస్తుతానికి ఖాళీగా లేరు. పైగా.. ఎన్టీఆర్ ఖాళీ అయ్యే లోపు షూటింగ్ పూర్తి చేయాలి కాబట్టి, పెద్ద ప్రాజెక్టులేవీ పట్టాలపై తీసుకెళ్లేంత సమయం ఉండదు. అందుకే.. ఓ యంగ్ హీరోతో సినిమా పూర్తి చేస్తే బెటర్ అన్నది త్రివిక్రమ్ ఆలోచన. ఇప్పుడు త్రివిక్రమ్ దృష్టి నానిపై పడిందని టాక్. నానికి సరిపడ రొమాంటిక్ కామెడీ కథ త్రివిక్రమ్ దగ్గర ఉందట. ఈసినిమాని 3 నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నాడట. 2021 మార్చి - ఏప్రిల్ లలో ఈ సినిమాని విడుదల చేయాలన్నది త్రివిక్రమ్ ఆలోచన. అన్నీకుదిరితే.... ఎన్టీఆర్ కంటే ముందుగా నానితో ఓ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.