బాలీవుడ్ లో మహానటి హవా.

By iQlikMovies - May 31, 2020 - 16:14 PM IST

మరిన్ని వార్తలు

దీపికా పదుకొణె.. బాలీవుడ్ సూపర్ స్టార్. దేశవ్యాప్తంగా అభిమానులు వున్నారు మస్తానీకి. ఒక స్టార్ కి తీసిపోని క్రేజ్ అమెది. అందుకే ఆమె నుండి వచ్చిన ప్రతిమాట ట్రెండ్ అవుతుంటుంది. ఇప్పుడు ''మహానటి'' సినిమా ట్రెండ్ అయ్యింది బాలీవుడ్ లో. మహానటి సావిత్రమ్మ జీవితం ఆధారంగా తీసిన సినిమా ‘మహానటి’. టాలీవుడ్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన సినిమా ఇది. 2018లో విడుదలైన ఈ సినిమా విమర్శకులతో పాటు ప్రముఖుల ప్రశంసలు పొందింది.

 

ఈ చిత్రానికి గానూ కీర్తి సురేశ్‌ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. అయితే ఇప్పటి ఈ సినిమా చూసి తీరిక దీపికకి దొరికింది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లో వుంటున్న దీపిక ఈ సినిమా చూసింది. చూడటమే కాదు.. ‘వెంటనే ఈ సినిమా చూడండి’ అంటూ తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో మహానటి పోస్టర్ పోస్ట్ చేసింది. దీపిక పోస్ట్ తో మహానటి ఇప్పుడు బాలీవుడ్ లో ట్రెండ్ అవుతుంది. కాగ దీపిక పోస్ట్ చూసిన చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ‘ ఉదయాన్నే కూల్‌ నోటిఫికేషన్‌తో నిద్రలేచా’నని అని దీపికకి థ్యాంక్స్ చెప్పాడు. మొత్తానికి దీపిక ట్వీట్ తో ఇప్పుడు మరోసారి బాలీవుడ్ టాక్స్ లో నిలించింది మహానటి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS