పెళ్ళికి రెడీ అవుతోన్న 'పద్మావతి'?

మరిన్ని వార్తలు

'పద్మావత్‌' సినిమాతో సెన్సేషనల్‌ విజయం అందుకుంది దీపికా పదుకొనె. ఆ తర్వాత దీపిక నటిస్తున్న చిత్రం 'సప్నాదీదీ'. ఇదో బయోపిక్‌. సినిమాల సంగతి పక్కన పెడితే, అసలు విషయానికి వచ్చేదాం. అందాల దీపికా త్వరలోనే పెళ్ళి చేసుకోబోతోందట. ఈ విషయమే ఇప్పుడు బాలీవుడ్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. మరి పెళ్లికొడుకెవరంటా? అంటే, ఇంకెవరై ఉంటారు. దీపిక బోయ్‌ ఫ్రెండ్‌ రణ్‌వీర్‌ సింగేనని బాలీవుడ్‌ వర్గాల సమాచారమ్‌. 

గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమకు పెద్దల నుండి కూడా అంగీకారం ఉన్నట్లు కుటుంబ సభ్యుల నుండి అందుతున్న సమాచారమ్‌. అంతేకాదు, రణ్‌వీర్‌ పక్కన ఉంటే, తనకింకెవ్వరూ అవసరం లేదని దీపికా గతంలో పలు మార్లు చెప్పేసింది కూడా. మరింకేం తన జీవిత భాగస్వామి విషయంలో దీపికా ఎప్పుడో ఓ క్లారిటీకొచ్చేసిందని భావించాలి. ఈ మధ్య టాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ కూడా ప్రేమ పెళ్లిళ్లు బాగానే సక్సెస్‌ అవుతున్నాయి. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ సమంత, నాగచైతన్యను వివాహమాడి, పెళ్లి తర్వాత కూడా చక్కగా సినిమాల్లో కొనసాగుతోంది. 

అలాగే ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని వివాహం చేసుకుని బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. అలాగే దీపికా - రణ్‌వీర్‌లు కూడా పెళ్లి ముడితో ఒక్కటై తర్వాత కూడా తమ కెరీర్‌ని విజయవంతంగా కొనసాగించే యోచనలో ఉన్నారట. దీపికా - రణ్‌వీర్‌ది ఆన్‌ స్క్రీన్‌ ది బెస్ట్‌ హిట్‌ పెయిర్‌. 'పద్మావత్‌'లో రణ్‌వీర్‌ సింగ్‌ నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించాడు. అన్నీ కుదిరితే, ముందుగా, ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమైతే, అతి త్వరలోనే ఈ ఆన్‌ స్క్రీన్‌ హిట్‌ పెయిర్‌, ఆఫ్‌ స్క్రీన్‌లో కూడా హిట్‌ పెయిర్‌ అనిపించుకుంటారనడంలో సందేహం లేదనే చెప్పాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS