శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'పడి పడి లేచె మనసు'. తాజాగా వచ్చిన స్టిల్స్‌తో సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయట ఈ సినిమాకి. ఫ్యాన్స్ ఆఫర్స్‌తో డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారట. 'లై' సినిమాతో నిరాశపరిచినా, డైరెక్టర్ హను రాఘవపూడిపై డిస్ట్రిబ్యూటర్స్‌కి నమ్మకం వుంది. దాంతో ఏమాత్రం వెనుకాడకుండా ఈ సినిమాకి బిజినెస్ చేస్తున్నారట. ఊహించని స్థాయిలో బిజినెస్ జరుగుతోందనీ అంచనా వేస్తున్నారు.
శర్వానంద్‌కి ఓవర్సీస్లో కూడా మంచి మార్కెట్ ఉంది. 'శతమానం భవతి' సినిమాకి అక్కడ రికార్డు స్థాయిలో వసూళ్లు వచ్చాయి. దాంతో ఓవర్సీస్లో కూడా ఈ సినిమాకి ఓ రేంజ్లో బిజినెస్ జరుగుతోందనీ సమాచారమ్. అంతేకాదు ఈ సినిమాకి ట్రిపుల్ ధమాకా అని చెప్పాలి. ఓ పక్క శర్వానంద్. మరో పక్క సాయిపల్లవి అంచనాలకు మెయిన్ పిల్లర్స్ కాగా, మరో పిల్లర్ హను రాఘవపూడి. 'లై' నిరాశ పరిచినా, హనుని ఏమాత్రం తక్కువ అంచనా వేయలేకపోతున్నారు. దాంతో 'పడి పడి లేచె మనసు' చిత్రానికి ఇప్పటికే ఊహించని స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
ముందు ముందు ఈ సినిమాపై ఇంకెంత అంచనాలు పెరగనున్నాయో చూడాలి మరి. ఫెస్టివల్ హీరోగా శర్వానంద్‌కి మంచి పేరుంది. ఈ సినిమాని ఏ ఫెస్టివల్‌కి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారో, బాక్సాఫీస్‌కి ఏ స్థాయిలో కాసుల పంట పండించనున్నారో వేచి చూడాలిక.