బిగ్ బాస్ సీజన్ 2 చిట్ట చివరి దశకు చేరుకుంది. ఇంకొక రెండు వారాలు గడిస్తే ఈ సీజన్ విజేత ఎవరో కూడా తేలిపోతుంది. ఇక ప్రస్తుతం ఇంటిలో 7గురు సభ్యులు మిగిలారు, వారిలో అయుదుగురు మాత్రమే ఆఖరి వారం ఇంటిలో కొనసాగాబోతున్నారు.
ఇప్పుడున్న 7గురిలో ఇద్దరు ఈ వారం అలాగే వచ్చేవారం ఇంటి నుండి నిష్క్రమించనున్నారు. ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న సభ్యులు- కౌశల్, గీత మాధురి, రోల్ రైడా, దీప్తి & అమిత్. ఈ అయుదుగురిలో ఈ వారం ఇంటి నుండి బయటకి ఎవరు వెళతారు అన్న ఉత్కంట అందరిలోనూ ఉంది.
అయితే గతవారాల ప్రజల అభిప్రాయం గమనిస్తే ఈ వారం ఎలిమినేషన్ డేంజర్ లో ఉన్నది- రోల్ రైడా & అమిత్. ఈ ఇద్దరిలో ఒకరు ఇంటి నుండి నిష్క్రమిస్తారు అన్న టాక్ వినపడుతున్నది. ఇప్పటికే గత రెండు వారాల నుండి ఎలిమినేషన్ అంచుల వరకు వెళ్ళి బయటపడిన అమిత్ ఈ సారి మాత్రం తప్పక నిష్క్రమిస్తాడు అని అంటున్నారు. అయితే అమిత్ ఎలిమినేట్ ఎప్పుడో కావాల్సింది కాని కావాలని బిగ్ బాస్ నిర్వాహకులే అతన్ని ఇంటిలో ఉంచుతున్నారు అన్న పుకార్లు కూడా వచ్చాయి.
ఈ తరుణంలో ఇవాల్టి ఎలిమినేషన్ పైన అందరి దృష్టి పడింది. చూద్దాం.. ఈరోజు ఎవరు బిగ్ బాస్ ఇంటి నుండి బయటికోస్తారో..