నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఒక సందర్భంలో మాట్లాడుతూ బిగ్ బాస్ ఇంటిలో ఉన్న సభ్యులకన్నా బయట ఉన్న వారి కుటుంబసభ్యులు అలాగే వ్యాఖ్యాతగా తాను ఇంకా ఎక్కువ స్ట్రెస్ కి గురవుతున్నాము అని చెప్పాడు.
ఇది ఒకరకంగా నిజమే. ఎందుకంటే అసలు మొదటినుండి కూడా బిగ్ బాస్ షోని నాని వ్యాఖ్యాతగా అనుకున్నప్పటి నుండే ఆయనని ఎన్టీఆర్ తో పోల్చడం మొదలైంది. ముందు ఈ ఇద్దరికి పోలిక తెచ్చి నాని గురించి తేలికగా మాట్లాడడం కూడా జరిగింది.
ఇక తరువాతకాలంలో ఆయన ప్రతివారం ఇంటి సభ్యులతో మాట్లాడే విధానం పైన కూడా ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందనే వచ్చింది. ఒకరిద్దరు సభ్యుల పైన ఆడియన్స్ కోపం పెంచుకోవడానికి కారణం కూడా నానినే అన్న ప్రచారం కూడా జరిగింది.
ఈ సమయంలో ఆయన తన స్టాండ్ గురించి ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కౌశల్ మొన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో అతని నిర్ణయాలని తప్పు పట్టడం, రోల్ రైడాని అనుచిత పదంతో బాదపెట్టడం చేసావు అని నాని ప్రశ్నించాడు.
దీనితో వెంటనే కౌశల్ ఆర్మీ సోషల్ మీడియా వేదికగా నాని యాంకరింగ్ టార్గెట్ చేస్తూ కౌంటర్లు వేయడం ప్రారంభించేసింది. ఒక రకంగా నాని చెప్పుకున్నట్టు, ఈ సీజన్లో సోషల్ మీడియాలో ఇంటి సభ్యులకన్నా ఎక్కువగా టార్గెట్ అయింది అన్నది నిర్వివాదాంశం.
మరి ఈ రెండు వారాలు కూడా పూర్తయ్యాక నాని పైన ఓవరాల్ గా ఎటువంటి కామెంట్ వస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.