ఒకప్పుడు సినిమాలతో భారీ స్థాయిలో ఫ్యాన్స్ ని సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు రాజకీయాల్లో కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. మోదీ లాంటి నాయకుడితో పవన్ 'సునామి' లాంటి వాడు అనిపించుకున్నాడు. ఎట్టకేలకి పవన్ ఫాన్స్ కోరిక నెరవేరింది. దీనితో వారు కాలర్ ఎగరేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తమ నాయకుడు కీలకంగా మారాడని, గేమ్ చేంజర్ అంటూ మురిసిపోతున్నారు. ఒక వైపు డిప్యూటీ సీఎం హోదా. మరొక వైపు కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు తీకుని వాటిని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ పవన్ ఇక సినిమాల్లో నటించడేమో అన్న సందేహం కూడా మొదలయ్యింది ఫాన్స్ లో. దీనితో పొంగిన పాల మీద నీళ్లు జల్లినట్టు అయింది వారి సంతోషం. సర్లే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సిందే అనుకుని సరిపెట్టుకున్నారు.
టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వారి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ ఉంటే, పవన్ కళ్యాణ్ ఫాన్స్ మాత్రం కామ్ గా చూస్తున్నారు. ఇలాంటి టైం లో పవన్ ఫాన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. అవును పవన్ కళ్యాణ్ ఇక నుంచి వారానికి రెండు రోజులు సినిమాలకి టైం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికి తాను కమిట్ అయినా సినిమాల్ని కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారట. నిర్మాతలు పవన్ కళ్యాణ్ అంటే ఉన్న గౌరవంతో, ఇష్టంతో, ప్రెజర్ తీసుకు రాకపోయినా, వారికి నష్టం వచ్చే పని తాను చేయకూడదని పవన్ నిర్ణయించుకున్నారని సమాచారం.
దీనితో డబల్ ధమాకా లాంటి న్యూస్ దొరికింది పవన్ ఫాన్స్ కి. ఒక వైపు రాజకీయాలు, ఇంకో వైపు సినిమాలు పవన్ ప్రయాణం సూపర్ గా ఉంటుంది అని వాళ్లు ఆశ పడుతున్నారు. ఇపుడు పవన్ కున్న క్రేజ్ తో సినిమాలు రిలీజ్ అయితే రికార్డ్ ల మోత మోగాల్సిందే అని విజిల్స్ వేస్తున్నారు. హరి హర వీరమల్లు, OG , ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి క్రేజ్ ప్రాజెక్ట్స్ తో పవన్ సందడి షురూ కానుంది బీ రెడీ బాయ్స్ అంటున్నారు.