RRR సినిమా తరవాత గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందాడు ఎన్టీఆర్ . ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్లో దేవర చేస్తున్నాడు. ఈ మూవీ సెప్టెంబర్ 27 న రిలీజ్ అవుతోంది. నెక్స్ట్ వార్ 2 తో బాలీవుడ్ లో బ్లాస్ట్ కి రెడీ గా ఉన్నాడు. వీటి తరవాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ మొదలవనుంది. త్వరలో పట్టాలెక్కనున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి 'డ్రాగన్' అనే పేరు పరిశీలనలో ఉంది. డ్రాగన్ పేరు క్యాచీగా, ట్రెండీగా ఉందని ఎన్టీఆర్ ఫాన్స్ మురిసిపోతున్నారు. అయితే కొంతమంది నెటిజన్స్ డ్రాగన్ అంటే చెడుకి సంకేతం ఇదేంటి నీల్ ఇలా పెట్టాడని, హీరో క్యారక్టర్ లో ఏమైనా అలాంటి లక్షణాలు ఉంటాయా అని డౌట్స్ క్రియేట్ చేశారు.
వాటన్నిటిని నిజం చేస్తూ డ్రాగన్ పై క్లారిటీ వచ్చింది. డ్రాగన్ లో ఎన్టీఆర్ నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడని సమాచారం. హీరో క్యారక్టర్ ని దృష్టిలో పెట్టుకునే ఈ పేరు పెట్టినట్లు టాక్. కథకి, అందులో ఎన్టీఆర్ పాత్రకి పర్ఫెక్ట్ గా ఈ టైటిల్ సూట్ అవుతుందని నీల్ ఇలా డిసైడ్ చేసాడని తెలుస్తోంది. ఇంతక ముందు ఎన్టీఆర్ ఇలాంటి పాత్రలో కనిపించి మెప్పించాడు. పూరి జగన్నాథ్ డైరక్షన్లో వచ్చిన టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పూర్తి నెగిటీవ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో పాజిటీవ్ గా మారతాడు. అలాగే జై లవకుశలో జై పాత్ర కూడా పూర్తి నెగిటీవ్ షేడ్స్ తో ఉంటుంది. ఈ పాత్రలో ఎన్టీఆర్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. సినిమాలో జై పాత్ర హైలెట్.
ఇంకో వైపు ఎన్టీఆర్ హిందీలో నటిస్తున్న 'వార్ 2'లో కూడా నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడని, విలన్ అని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాల్లో ఎంత నిజముందో తెలియదు. నీల్ సినిమాల్లో హీరోలు ఉండరు అంతా విలన్లే. ఇప్పుడు కూడా ఆ రకంగానే డ్రాగన్ ఉండనుంది. 'డ్రాగన్' మీనింగ్ కి ఉన్న అర్థం, ఆ లక్షణాలు అన్నీ ఎన్టీఆర్ పాత్రలో ఉండే విధంగా ప్రశాంత్ నీల్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీతో ఎన్టీఆర్ కూడా పాన్ వరల్డ్ స్టార్ అవటం గ్యారంటీ అని ఫాన్స్ ఆశపడుతున్నారు.