నాగార్జున, నాని - ఇద్దరికీ క్లాస్‌లో మంచి పేరుంది. మాస్‌లో పట్టుంది. తమదైన రోజున ఏ సెంటరైనా దడదడలాడిస్తారు. మరి వీరిద్దరూ కలిస్తే.. బాక్సాఫీసు దగ్గర కలక్షన్ల వర్షం కురుస్తుంది. అందుకే `దేవదాస్` గురించి సినీ అభిమానులంతా ఆశగా ఎదురుచూశారు.
అయితే టాక్ పరంగా కాస్త నిరాశ పరిచిన `దేవదాస్` ట్రేడ్ పరంగా మాత్రం ఓకే అనిపించుకుంది. రెండు వారాలకు గానూ బాక్సాఫీసు దగ్గర రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నైజాంలో రూ.13.45 కోట్లు సాధించిన `దేవదాస్`, ఓవర్సీస్‌లో రూ.5.60 కోట్లు వసూలు చేసింది. వైజాగ్, ఈస్ట్, వెస్ట్ కలిపి మరో రూ.6 కోట్లు దక్కించుకుంది.
శాటిలైట్ రూపంలోనూ `దేవదాస్`కి మంచి రేటే దక్కింది. నిర్మాత సి. అశ్వనీదత్‌కి టేబుల్ ప్రాఫిట్ దక్కించినట్టైంది. ఎటు చూసినా దాదాపుగా రూ.20 కోట్ల షేర్‌తో `దేవదాస్` బాక్సాఫీసు జర్నీ ముగిసే అవకాశాలున్నాయి. సో.. టాక్ ఏవరేజ్‌గా ఉన్నా.. బయ్యర్లు మాత్రం సేఫ్ అయిపోవొచ్చు.
ఈవారం బాక్సాఫీసు దగ్గరకు `నోటా` వచ్చింది. నోటా ప్రభంజనం ముందు.. `దేవదాస్` జోరు చిన్నదైపోవొచ్చు. కానీ వీకెండ్‌లో మాత్రం `దేవదాస్`కి ఎన్నోకొన్ని వసూళ్లు దక్కుతాయి.