దేవసేన రాజసం అదరహో !

మరిన్ని వార్తలు

'బాహుబలి ది కన్‌క్లూజన్‌' వచ్చేస్తోంది. కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది ఈ సినిమా అలరించడానికి. ఈ లోగా చిత్ర యూనిట్‌ చేస్తున్న హడావిడి ఆకట్టుకుంటోంది. 'బాహుబలి' విషయంలో ఏం చేసినా సెన్సేషనే. చిత్ర యూనిట్‌ తెగ హల్‌ చల్‌ చేసేస్తోంది. తాజాగా సినిమా నుండి ఓ స్టిల్‌ బయటికి వచ్చింది. అదే దేవసేన అనుష్క లుక్‌. ఆ లుక్‌ చూస్తే చాలు కడుపు నిండిపోతుంది. అంత నిండుగా ఉంది ఆ లుక్‌. మహారాణిగా దేవసేన రాజసం అద్భుతంగా ఉంది. నిండైన ఆమె రూపం, అంతకు మించిన హుందాతనం, అందం మేళవించిన ఆ రూపానికి ఎంతటి వారైనా మంత్ర ముగ్ధులవక తప్పదు. తొలి పార్ట్‌లో అనుష్క డీ గ్లామర్‌ రోల్‌లో కనిపించింది. కానీ ఈ పార్ట్‌లో అలా కాదు. గ్లామర్‌తో పాటు మహారాణి పాత్రలో పోరాట ఘట్టాల్లో కూడా తన సత్తా చూపించనుంది. ఈ తాజా లుక్‌ సినిమాపై అంచనాలు మరింత పెంచుతోంది. రాజమౌళి అద్భుత సృష్టి 'బాహుబలి' సినిమా కోసం యావత్‌ ప్రపంచం ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తోంది. ఈ శుక్రవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 600 ధియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది. బాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రబాస్‌, రానా, అనుష్క, తమన్నా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు ఈ సినిమాలో.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS