కె విశ్వనాధ్ కోసం పవన్-త్రివిక్రమ్ లు అలా చేస్తారట!

మరిన్ని వార్తలు

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించిన వేళ, కె విశ్వనాధ్ గారికి అభినందనల వెల్లువ కొనసాగుతూనే ఉంది.

నిన్న మెగాస్టార్ వచ్చి కలిసి వెళితే, ఇవాళ ఆయన తమ్ముడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి విశ్వనాధ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ - విశ్వనాధ్ గారి సినిమాలలో ఒక 12 సినిమాలని ఒక డిస్క్ రూపంలో చేసి విడుదల చేయాలని ఉంది అని తెలిపారు. ఇదే విశ్వనాధ్ గారి పై తమకు ఉన్న గౌరవం, ప్రేమ కి తాము ఇస్తున్న చిరు కానుక అని వివరించారు.


త్రివిక్రమ్ మాట్లాడుతూ - ఆయన గురించి మాట్లాడే అంత స్థాయి, అనుభవం కాని తమకు లేవని, అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈయనకి దక్కడంతో ఆ అవార్డు పైన తనకి నమ్మకం పెరిగిందని తెలిపాడు.

వీరు చేయబోతున్న ఈ 12 సినిమాలని ఒకే సీడీ ద్వారా విడుదల చేయడం అనే దాని పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS