బిగ్ బాస్ సీజన్ ప్రారంభమైనప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కనిపించింది దేవీ నాగవల్లి. తన వాగ్థాటితో, చొరవతో.. అందరి హృదయాల్నీ గెలుచుకుంది. ఫైనలిస్ట్స్‌లో దేవి తప్పకుండా ఉంటుందనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా 3వ వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. దేవి ఎలిమినేషన్ అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. కావాలనే దేవిని ఎలిమినేట్ చేశారని, తనని ఎవరో తొక్కేశారన్న అభిప్రాయం వ్యక్తం అయ్యింది. దాంతో పాటు దేవి కూడా `నాకు బిగ్ బాస్ హౌస్‌లో అన్యాయం చేశారు` అంటూ వాపోయింది.
తనని మళ్లీ పిలిచినా, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనని శపథం చేసింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో.. బిగ్‌బాస్ హౌస్ మేట్స్ రీ యూనియన్ జరిగింది. తొలుత.. ఈ రీ యూనియన్‌లో దేవి కనిపించలేదు. అందరూ వచ్చినా దేవి రాకపోవడం బిగ్ బాస్ ఫాలోయర్స్ ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
దేవికి ఇంకా బిగ్ బాస్ పై కోపం పోలేదని, అందుకే తాను రాలేదని అనుకున్నారు. అయితే అనూహ్యంగా చివర్లో దేవి దర్శనం జరిగింది. బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరితోనూ దేవి కలవగలిగింది. దాంతో.. బిగ్ బాస్‌పై, తనపై వస్తున్న రూమర్లకు దేవి సమాధానం చెప్పినట్టైంది. ఒక వేళ గ్రాండ్ ఫినాలేలో దేవి కనిపించకపోతే... దేవికి ఇంకా కోపం ఉందన్న రూమరే నిజమైపోయేది.