చిరంజీవి అంటే దేవిశ్రీ ప్రసాద్ కి వల్లమాలిన అభిమానం. శంకర్ దాదా ఎంబీబీఎస్. అందరివాడు, శంకర్ దాదా జిందాబాద్, ఖైదీ నెం 150.. ఇలా చిరు నుంచి అవకాశం వచ్చిన ప్రతీసారీ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ చిరంజీవి నుంచి దేవికి పిలుపొచ్చింది. చిరు - బాబీ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నట్టు సమాచారం.
ఇప్పటికే బాబీ - దేవి మధ్య భేటీ మొదలైపోయిందని టాక్. చిరు చేతిలో ఇప్పుడు మూడు సినిమాలున్నాయి. అందులో మాస్ పాటలకు ప్రాముఖ్యం ఉన్న కథ బాబీదే. అందుకే చిరు ఏరి కోరి... దేవిశ్రీ ప్రసాద్ కి ఈ ఛాన్స్ ఇచ్చాడని టాక్. ప్రస్తుతం `ఆచార్య`తో బిజీగా ఉన్నాడు చిరు. ఆ తరవాత... లూసీఫర్ రీమేక్ పట్టాలెక్కుతుంది. ఇది అయ్యాకే.. బాబీ సినిమా మొదలవుతుంది.