త్వరలో ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం ఖాయమైందా? ఆయనకు.. తెలంగాణ టీడీపీ బాధ్యతల్ని అప్పగిస్తారా? ప్రస్తుతం - రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఇటీవల షర్మిల.. తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేయడానికి సమాయాత్తం అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి మార్పే.. తెలంగాణ టీడీపీలోనూ జరగబోతోందని, తెలంగాణలో టీడీపీకి గత వైభవం తెచ్చేందుకు.. ఎన్టీఆర్ కి ఆ ఆబాధ్యతలు అప్పగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.
గత ఎన్నికల్లో టీడీపీకి దూరంగా ఉన్నారు ఎన్టీఆర్. బాలయ్యకూ.. ఎన్టీఆర్ కీ మధ్య విబేధాలు ఉన్నాయని, అందుకే... ఎన్టీఆర్ ఈ ఎన్నికలలో టీడీపీ జెండా ఎత్తుకోలేదని ఇన్‌సైడ్ వర్గాల టాక్. అయితే ఆ విబేధాల్ని తొలగించి, ఎన్టీఆర్‌కి పార్టీలో సముచిత స్థానం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారని, ఆ క్రమంలోనే తెలంగాణ ఇన్‌ఛార్జ్ గా ఎన్టీఆర్‌ని నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. ఈ బాధ్యతలు స్వీకరించడానికి ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నాడా? లేదా? అన్నది ఆసక్తికరం. ఎన్టీఆర్ ఓకే అంటే మాత్రం.. తెలంగాణ టీడీపీకి కొత్త వైభవం వచ్చినట్టే.