టీజర్ దెబ్బకి 'దేవి శ్రీ'లో కసి పెరిగిందట !

మరిన్ని వార్తలు

మహేష్ బాబు మొదటిసారి కామెడీ జానర్ మీద ఎక్కువ దృష్టి పెట్టి చేస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రిలీజైన ఈ సినిమా టీజర్ ఇంకా ట్రెండ్ అవుతోన్నా.. దేవికి మాత్రం మ్యూజిక్ పరంగా పెద్దగా నేమ్ అయితే రాలేదు. గతంలో మహేష్ నటించిన 'శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను' చిత్రాలకు బ్రహ్మాండమైన సంగీతం అందించిన దేవి శ్రీ 'సరిలేరు నీకెవ్వరు'కు మాత్రం ఆ స్థాయిలో ట్యూన్స్ ఇవ్వలేకపోతున్నాడనే వార్త ఫిల్మ్ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది.

 

మొత్తానికి ఆ వార్త దేవి చెవిలో పడిందట. దాంతో 'దేవి'లో కసి పెరిగిందట. తాజాగా ఓ కొత్త ట్యూన్ ఇచ్చాడని.. ట్యూన్ అద్భుతంగా ఉందని తెలుస్తోంది. ఏమైనా దేవి కసితో పనిచేస్తున్నాడని ఈ సారి సంగీతం అదరగొట్టేశాడని, పూర్తి సంతృప్తిగా ఉండబోతుందని తెలుస్తోంది. కాగా మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయకిగా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. జనవరి 11న విడుదలకానున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS