డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మొత్తానికి 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో భారీ విజయాన్నే నమోదు చేశాడు. కాగా ప్రస్తుతం పూరి తన తదుపరి సినిమాని సెన్సేషనల్ స్టార్ 'విజయ్ దేవరకొండ'తో ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 20 నుండి మొదలుకానుంది. ఫస్ట్ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ స్ తియనున్నారని తెలుస్తోంది. మరి ఈ చిత్రం ఏ జోనర్ లో తెరకెక్కనుంది..? సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటించనున్నారని నెటిజన్లు బాగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు సోషల్ మీడియా సెన్సేషన్ హీరోయిన్ మలయాళ బ్యూటీ 'ప్రియా ప్రకాష్ వారియర్' కూడా విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించబోతుందట. ఆ మధ్య 'నువ్వంటే నాకు చాలా ఇష్టం’’ అని విజయ్ గురించి ప్రియా పోస్ట్ కూడా చేసింది. అందుకే విజయ్ దేవరకొండ, పూరిని అడిగి మరి అమ్మడికి అవకాశం ఇప్పించాడని కామెంట్లు కూడా వినపడుతున్నాయి. ఈ సోషల్ మీడియా హీరోయిన్ ను మలయాళంలో ఎవ్వరూ పెద్దగా పటించుకునట్లు కనబడట్లేదు. అందుకే ఆమె తెలుగు ఇండస్ట్రీనే టార్గెట్ చేసుకుంది. ఎలాగూ దక్షిణాదిన ఇతర భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేసి మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్లు నెక్స్ట్ టార్గెట్ చేసేది తెలుగు సినిమా పరిశ్రమే. మరి పూరిసినిమాతోనైనా ప్రియా ప్రకాష్ కి భారీ హిట్ వస్తోందేమో చూడాలి.
అలాగే ఈ సినిమాలో నటించే మిగిలిన నటీనటులు ఎవరు అనే విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమా కూడా పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించనున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించిన పూరి, మరి ఈ సినిమాకి ఏ నేపధ్యాన్ని ఎంచుకుంటాడో చూడాలి.